News
నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలోనిది కాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిది కాదని.. కేంద్రం, ఆర్‌బీఐ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. శాసనసభలో నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడం సభ గౌరవానికి భంగం కలిగిస్తుందన్నారు. కేంద్రాన్ని విమర్శించే విధంగా చర్చ ఉండకూడదు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రం మీద ఏ మేరకు ప్రభావం పడిందనే విషయం మాత్రమే చర్చిద్దామని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకున్న పాలసీ గురించి చర్చ వద్దు.. మన ఇబ్బందుల గురించి మాట్లాడుకుందామన్నారు. సభ సూచనలు, సలహాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న వ్యాపారులు, సామాన్యుల ఇబ్బందులు వివరిద్దామని తెలిపారు. యూపీఏ, ఎన్‌డీఏ మన సభ పరిధిలో లేదు. సభలో లేని వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడటం సరికాదన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








